లూకా 13:12
యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
లూకా 13:12
యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను.
సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవాని తోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.
ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.