Home లూకా 11:35 · తెలుగు బైబిల్

లూకా

Chapter 11 · Verse 35

తెలుగు బైబిల్

లూకా 11:35

కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.

Book: Luke · Chapter: 11 · Verse: 35

Cross References

సామెతలు 16:25

ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.

సామెతలు 26:12

తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

యెషయా 5:20

కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

యిర్మియా 8:8

మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.

యోహాను 7:48

అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?

యోహాను 9:39

అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

రోమీయులకు 1:22

వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

రోమీయులకు 2:19

జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

1 కొరింథీయులకు 1:19

ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

1 కొరింథీయులకు 3:18

ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.

యాకోబు 3:13

మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

2 పేతురు 1:9

ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.

2 పేతురు 2:18

వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

ప్రకటన గ్రంథము 3:17

నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme