Home లేవీయకాండము 7:5 · తెలుగు బైబిల్

లేవీయకాండము

Chapter 7 · Verse 5

తెలుగు బైబిల్

లేవీయకాండము 7:5

యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;

Book: Leviticus · Chapter: 7 · Verse: 5

Cross References

లేవీయకాండము 1:9

అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

లేవీయకాండము 1:13

దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.

లేవీయకాండము 2:2

యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.

లేవీయకాండము 2:9

అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాప కార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.

లేవీయకాండము 2:16

అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజ కుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

లేవీయకాండము 3:3

అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను

లేవీయకాండము 3:16

యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.

గలతీయులకు 2:20

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.

గలతీయులకు 5:24

క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు.

1 పేతురు 4:1

క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme