లేవీయకాండము 3:8
తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
లేవీయకాండము 3:8
తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును.
అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను
సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతు లుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.
ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.