లేవీయకాండము 25:34
వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
లేవీయకాండము 25:34
వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.
సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.
అది యెహోవాకు ప్రతి ష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.