Home లేవీయకాండము 24:6 · తెలుగు బైబిల్

లేవీయకాండము

Chapter 24 · Verse 6

తెలుగు బైబిల్

లేవీయకాండము 24:6

యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.

Book: Leviticus · Chapter: 24 · Verse: 6

Cross References

నిర్గమకాండము 25:23

మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.

నిర్గమకాండము 25:30

నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.

నిర్గమకాండము 37:10

మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.

నిర్గమకాండము 39:36

బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,

నిర్గమకాండము 40:22

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి

1 రాజులు 7:48

మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,

2 దినవృత్తాంతములు 4:19

దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,

2 దినవృత్తాంతములు 13:11

వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

నెహెమ్యా 10:34

మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.

1 కొరింథీయులకు 14:40

సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.

హెబ్రీయులకు 9:2

ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme