Home లేవీయకాండము 20:13 · తెలుగు బైబిల్

లేవీయకాండము

Chapter 20 · Verse 13

తెలుగు బైబిల్

లేవీయకాండము 20:13

ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

Book: Leviticus · Chapter: 20 · Verse: 13

Cross References

ఆదికాండము 19:5

లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

లేవీయకాండము 18:22

స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.

ద్వితీయోపదేశకాండము 23:17

ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.

న్యాయాధిపతులు 19:22

వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టినీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా

రోమీయులకు 1:26

అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.

1 కొరింథీయులకు 6:9

అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను

1 తిమోతికి 1:10

హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,

యూదా 1:7

ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme