Home లేవీయకాండము 2:13 · తెలుగు బైబిల్

లేవీయకాండము

Chapter 2 · Verse 13

తెలుగు బైబిల్

లేవీయకాండము 2:13

నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.

Book: Leviticus · Chapter: 2 · Verse: 13

Cross References

నిర్గమకాండము 30:35

వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

సంఖ్యాకాండము 18:19

ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన.

2 దినవృత్తాంతములు 13:5

ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.

ఎజ్రా 7:22

వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.

యెహెజ్కేలు 43:24

యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింప వలెను.

మత్తయి 5:13

మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

మార్కు 9:49

ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.

కొలస్సీయులకు 4:6

ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme