లేవీయకాండము 19:9
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;
లేవీయకాండము 19:9
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుమునేను మీ కిచ్చు చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడ నైన యెహోవాను.
ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.
నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారి కిని విధవరాండ్రకును ఉండవలెను.
మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కూమారీ పొమ్మనెను.
అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.
ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజుఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.