లేవీయకాండము 17:10
మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
లేవీయకాండము 17:10
మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.
నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.
మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.
జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయునట్లు,
ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసెదను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.