న్యాయాధిపతులు 5:11
విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
న్యాయాధిపతులు 5:11
విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.
ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రా యేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థు డైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.
కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్ని ధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి
పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు
ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.
ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
నా జనులారా, యెహోవా నీతి కార్య ములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.