Home న్యాయాధిపతులు 21:7 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 21 · Verse 7

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 21:7

మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.

Book: Judges · Chapter: 21 · Verse: 7

Cross References

న్యాయాధిపతులు 21:1

ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.

న్యాయాధిపతులు 21:18

ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.

న్యాయాధిపతులు 21:22

తరువాత వారి తండ్రులైనను సహో దరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెద మనిరి.

1 సమూయేలు 14:28

జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.

1 సమూయేలు 14:45

అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme