న్యాయాధిపతులు 12:8
అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.
న్యాయాధిపతులు 12:8
అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.
కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను
కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
యూదా బేత్లెహేములోనుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక ¸యౌవనుడుండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను.
ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.