Home న్యాయాధిపతులు 12:3 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 12 · Verse 3

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 12:3

నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.

Book: Judges · Chapter: 12 · Verse: 3

Cross References

న్యాయాధిపతులు 9:17

అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహో దరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు

న్యాయాధిపతులు 11:27

ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక.

1 సమూయేలు 19:5

అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

1 సమూయేలు 28:21

అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచినా యేలిన వాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.

2 దినవృత్తాంతములు 13:12

ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.

యోబు 13:14

నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

కీర్తనలు 119:109

నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.

రోమీయులకు 16:4

వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.

ప్రకటన గ్రంథము 12:11

వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme