ద్వితీయోపదేశకాండము 1:1యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారాను కును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థల ములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.
యెహోషువ 8:5నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.
యెహోషువ 8:16వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
న్యాయాధిపతులు 20:34అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.
న్యాయాధిపతులు 20:37మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారి నందరిని హతముచేసిరి.
ప్రసంగి 9:12తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
యెషయా 19:11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
యెషయా 19:13సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
దానియేలు 4:31రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
మత్తయి 24:39జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
మత్తయి 24:50ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.
2 పేతురు 2:3వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.