యోహాను 12:27ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
యోహాను 13:36సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 12:3ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.
అపొస్తలుల కార్యములు 21:11అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.
2 కొరింథీయులకు 5:4ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.