యోహాను 18:25
సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
యోహాను 18:25
సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
శారా భయపడి - నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా?
పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.
అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.
అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.