Home యోహాను 16:4 · తెలుగు బైబిల్

యోహాను

Chapter 16 · Verse 4

తెలుగు బైబిల్

యోహాను 16:4

అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.

Book: John · Chapter: 16 · Verse: 4

Cross References

యెషయా 41:22

జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

మత్తయి 9:15

యేసుపెండ్లి కుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు.

మత్తయి 10:7

వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.

మత్తయి 24:25

ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

మార్కు 2:19

యేసుపెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని

మార్కు 13:23

మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.

లూకా 21:12

ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

యోహాను 13:19

జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.

యోహాను 14:29

ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.

యోహాను 17:12

నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.

అపొస్తలుల కార్యములు 9:16

ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 20:23

బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్ట ణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.

2 థెస్సలొనీకయులకు 2:5

నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?

2 పేతురు 1:14

నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme