Home యోహాను 12:29 · తెలుగు బైబిల్

యోహాను

Chapter 12 · Verse 29

తెలుగు బైబిల్

యోహాను 12:29

కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.

Book: John · Chapter: 12 · Verse: 29

Cross References

నిర్గమకాండము 19:16

మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.

నిర్గమకాండము 20:18

ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి.

యోబు 37:2

ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.

యోబు 40:9

దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?

యెహెజ్కేలు 10:5

దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.

అపొస్తలుల కార్యములు 23:8

సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.

ప్రకటన గ్రంథము 6:1

ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.

ప్రకటన గ్రంథము 8:5

ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.

ప్రకటన గ్రంథము 11:19

మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

ప్రకటన గ్రంథము 14:2

మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

ప్రకటన గ్రంథము 18:1

అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme