Home యోబు 8:6 · తెలుగు బైబిల్

యోబు

Chapter 8 · Verse 6

తెలుగు బైబిల్

యోబు 8:6

నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.

Book: Job · Chapter: 8 · Verse: 6

Cross References

యోబు 1:8

అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

యోబు 4:6

నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

యోబు 5:24

నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.

యోబు 11:14

పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల

యోబు 16:17

ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

యోబు 21:14

వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

యోబు 22:23

సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.

కీర్తనలు 7:6

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

కీర్తనలు 18:25

దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

కీర్తనలు 26:5

దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను

కీర్తనలు 44:23

ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

కీర్తనలు 59:4

నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

సామెతలు 3:33

భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.

సామెతలు 15:8

భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.

యెషయా 1:15

మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

యెషయా 3:10

మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme