యోబు 30:17
రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
యోబు 30:17
రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.
ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.