యోబు 23:6
ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
యోబు 23:6
ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా - నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా - ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?
మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.
నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.
నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి
నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.
జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.