యోబు 22:16
వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
యోబు 22:16
వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.
జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
కావున వారు ¸యౌవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.
మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.