Home యోబు 18:15 · తెలుగు బైబిల్

యోబు

Chapter 18 · Verse 15

తెలుగు బైబిల్

యోబు 18:15

వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును.

Book: Job · Chapter: 18 · Verse: 15

Cross References

ఆదికాండము 19:24

అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

ద్వితీయోపదేశకాండము 28:24

యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.

ద్వితీయోపదేశకాండము 29:23

వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి

యోబు 15:34

భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

యోబు 18:12

వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును.

యోబు 20:18

దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

యోబు 31:38

నా భూమి నామీద మొఱ్ఱపెట్టిన యెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

కీర్తనలు 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.

యెషయా 34:9

ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును.

యిర్మియా 22:13

నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

హబక్కూకు 2:6

తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.

జెకర్యా 5:4

ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.

ప్రకటన గ్రంథము 19:20

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

ప్రకటన గ్రంథము 21:8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme