Home యోబు 1:19 · తెలుగు బైబిల్

యోబు

Chapter 1 · Verse 19

తెలుగు బైబిల్

యోబు 1:19

గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

Book: Job · Chapter: 1 · Verse: 19

Cross References

ఆదికాండము 37:32

ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి - ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

ఆదికాండము 42:36

అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.

న్యాయాధిపతులు 16:30

నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.

2 సమూయేలు 18:33

అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

1 రాజులు 20:30

తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా

యిర్మియా 4:11

ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.

మత్తయి 7:27

వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

లూకా 13:1

పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా

అపొస్తలుల కార్యములు 28:4

ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.

ఎఫెసీయులకు 2:2

మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme