యిర్మియా 51:55
యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.
యిర్మియా 51:55
యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును
జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.
ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.
సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.
వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు.
సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.
ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా తూరుపట్టణమా, నేను నీకు విరోధి నైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.
మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.