యిర్మియా 44:1
మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యిర్మియా 44:1
మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు.
ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.
ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.
మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లినయెడల
మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశములనుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును,
ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,
ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.
చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,
పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.
ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.