Home యిర్మియా 43:1 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 43 · Verse 1

తెలుగు బైబిల్

యిర్మియా 43:1

అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా

Book: Jeremiah · Chapter: 43 · Verse: 1

Cross References

నిర్గమకాండము 24:3

మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.

1 సమూయేలు 8:10

సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి

యిర్మియా 1:7

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.

యిర్మియా 1:17

కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.

యిర్మియా 26:2

యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

యిర్మియా 26:8

జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.

యిర్మియా 42:3

మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.

యిర్మియా 42:22

కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.

యిర్మియా 51:63

ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి

మత్తయి 28:20

నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 5:20

ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

అపొస్తలుల కార్యములు 20:27

దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme