Home యిర్మియా 41:9 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 41 · Verse 9

తెలుగు బైబిల్

యిర్మియా 41:9

ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

Book: Jeremiah · Chapter: 41 · Verse: 9

Cross References

యెహోషువ 10:16

ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.

న్యాయాధిపతులు 6:2

మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

1 సమూయేలు 13:6

ఇశ్రా యేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.

1 సమూయేలు 14:11

వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

1 సమూయేలు 14:22

అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.

1 సమూయేలు 24:3

మార్గముననున్న గొఱ్ఱె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

2 సమూయేలు 17:9

అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగి యుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభ మందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పు కొందురు.

1 రాజులు 15:17

ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.

1 రాజులు 15:22

అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.

2 దినవృత్తాంతములు 16:1

ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సర మున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా

హెబ్రీయులకు 11:38

అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme