Home యిర్మియా 40:1 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 40 · Verse 1

తెలుగు బైబిల్

యిర్మియా 40:1

రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.

Book: Jeremiah · Chapter: 40 · Verse: 1

Cross References

యెహోషువ 18:25

గిబియోను రామా బెయేరోతు మిస్పే

1 సమూయేలు 7:17

మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

2 దినవృత్తాంతములు 16:1

ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సర మున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా

కీర్తనలు 68:6

దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.

కీర్తనలు 107:16

ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.

యిర్మియా 31:15

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

యిర్మియా 39:9

అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి యున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.

యిర్మియా 39:11

మరియు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు

యిర్మియా 42:7

పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను గనుక

అపొస్తలుల కార్యములు 12:6

హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.

అపొస్తలుల కార్యములు 21:13

పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 28:20

ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.

ఎఫెసీయులకు 6:20

దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme