Home యిర్మియా 38:23 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 38 · Verse 23

తెలుగు బైబిల్

యిర్మియా 38:23

నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.

Book: Jeremiah · Chapter: 38 · Verse: 23

Cross References

సంఖ్యాకాండము 4:18

మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.

2 రాజులు 25:7

సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.

2 దినవృత్తాంతములు 36:20

ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.

యిర్మియా 21:10

ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 27:12

నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు

యిర్మియా 32:4

అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;

యిర్మియా 34:3

నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయ ముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖా ముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.

యిర్మియా 38:18

అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు.

యిర్మియా 39:5

అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి

యిర్మియా 39:6

బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.

యిర్మియా 41:10

అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

యిర్మియా 52:8

కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

యెహెజ్కేలు 14:9

మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలముచేసెదను

యెహెజ్కేలు 43:3

నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కన బడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme