Home యిర్మియా 37:3 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 37 · Verse 3

తెలుగు బైబిల్

యిర్మియా 37:3

రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు పంపిదయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.

Book: Jeremiah · Chapter: 37 · Verse: 3

Cross References

నిర్గమకాండము 8:8

అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.

నిర్గమకాండము 8:28

అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.

నిర్గమకాండము 9:28

ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా

నిర్గమకాండము 10:17

మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా

సంఖ్యాకాండము 21:7

కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.

1 సమూయేలు 12:19

సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.

1 రాజులు 13:6

అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.

యిర్మియా 2:27

వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.

యిర్మియా 21:1

రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి

యిర్మియా 21:2

బబులోనురాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

యిర్మియా 29:21

నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రక టించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యిర్మియా 29:25

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యిర్మియా 38:1

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.

యిర్మియా 42:2

మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.

యిర్మియా 42:20

మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.

యిర్మియా 52:24

మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టు కొనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme