Home యిర్మియా 35:18 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 35 · Verse 18

తెలుగు బైబిల్

యిర్మియా 35:18

మరియు యిర్మీయా రేకాబీయులను చూచి యిట్లనెను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మికాజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు.

Book: Jeremiah · Chapter: 35 · Verse: 18

Cross References

నిర్గమకాండము 20:12

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

ద్వితీయోపదేశకాండము 4:40

మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.

ద్వితీయోపదేశకాండము 5:16

నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.

ఎఫెసీయులకు 6:1

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme