ద్వితీయోపదేశకాండము 4:7ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?
ద్వితీయోపదేశకాండము 30:3నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
ద్వితీయోపదేశకాండము 30:5నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.
1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
కీర్తనలు 32:6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
కీర్తనలు 46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కీర్తనలు 126:1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
కీర్తనలు 126:4దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.
యెషయా 14:1ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
యెషయా 45:19అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.
యెషయా 55:6యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.
యిర్మియా 3:14భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
యిర్మియా 16:14యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట
యిర్మియా 16:15అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.
యిర్మియా 23:3మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.