ద్వితీయోపదేశకాండము 8:2మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.
ద్వితీయోపదేశకాండము 8:14నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
ద్వితీయోపదేశకాండము 8:15తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్య ములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,
ద్వితీయోపదేశకాండము 32:10అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
న్యాయాధిపతులు 6:13గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
2 రాజులు 2:14ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
యోబు 3:5చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక
యోబు 35:10అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
కీర్తనలు 23:4గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
కీర్తనలు 77:5తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
యెషయా 63:9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
యెషయా 63:11అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?
యెషయా 64:7నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.
యిర్మియా 2:2నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.