Home యిర్మియా 11:6 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 11 · Verse 6

తెలుగు బైబిల్

యిర్మియా 11:6

యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా - నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.

Book: Jeremiah · Chapter: 11 · Verse: 6

Cross References

ద్వితీయోపదేశకాండము 4:1

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.

ద్వితీయోపదేశకాండము 4:5

నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

కీర్తనలు 15:5

తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

యెషయా 58:1

తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము

యిర్మియా 3:12

నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రక టింపుముద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 7:2

నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

యిర్మియా 11:2

మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను

యిర్మియా 19:2

నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.

జెకర్యా 7:7

యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణదేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తలద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?

యోహాను 13:17

ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.

రోమీయులకు 2:13

ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

యాకోబు 1:22

మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme