Home యిర్మియా 10:20 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 10 · Verse 20

తెలుగు బైబిల్

యిర్మియా 10:20

నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.

Book: Jeremiah · Chapter: 10 · Verse: 20

Cross References

యోబు 7:8

నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.

సామెతలు 12:7

భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.

యెషయా 49:20

నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

యెషయా 51:16

నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

యెషయా 51:18

ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయిపట్టు కొనువాడెవడును లేకపోయెను.

యెషయా 54:2

నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

యిర్మియా 4:20

కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.

యిర్మియా 30:17

వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 31:15

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

విలాపవాక్యములు 1:5

దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి

విలాపవాక్యములు 2:4

శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి చెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనముచేసి యున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి యున్నాడు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme