Home యెషయా 65:23 · తెలుగు బైబిల్

యెషయా

Chapter 65 · Verse 23

తెలుగు బైబిల్

యెషయా 65:23

వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.

Book: Isaiah · Chapter: 65 · Verse: 23

Cross References

ఆదికాండము 12:2

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

ఆదికాండము 17:7

నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

లేవీయకాండము 26:3

మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

లేవీయకాండము 26:20

మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.

లేవీయకాండము 26:22

మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

లేవీయకాండము 26:29

మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

ద్వితీయోపదేశకాండము 28:3

నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు;

ద్వితీయోపదేశకాండము 28:38

విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.

ద్వితీయోపదేశకాండము 28:41

కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.

యోబు 21:8

వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

కీర్తనలు 115:14

యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

యెషయా 49:4

అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.

యెషయా 55:2

ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.

యెషయా 61:9

జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచినవారందరు ఒప్పుకొందురు

యిర్మియా 32:38

వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.

యెహెజ్కేలు 36:29

మీ సకల మైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme