Home యెషయా 52:3 · తెలుగు బైబిల్

యెషయా

Chapter 52 · Verse 3

తెలుగు బైబిల్

యెషయా 52:3

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

Book: Isaiah · Chapter: 52 · Verse: 3

Cross References

లేవీయకాండము 25:54

అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.

కీర్తనలు 44:12

అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు

కీర్తనలు 44:13

మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి యున్నావు.

యెషయా 45:13

నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

యెషయా 50:1

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

యిర్మియా 15:13

నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.

రోమీయులకు 7:14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.

1 పేతురు 1:18

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme