Home యెషయా 45:9 · తెలుగు బైబిల్

యెషయా

Chapter 45 · Verse 9

తెలుగు బైబిల్

యెషయా 45:9

మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

Book: Isaiah · Chapter: 45 · Verse: 9

Cross References

నిర్గమకాండము 9:16

నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.

యోబు 9:4

ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

యోబు 9:12

ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

యోబు 10:9

జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

యోబు 15:24

శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.

యోబు 40:2

ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.

యోబు 40:8

నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?

కీర్తనలు 2:2

మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

సామెతలు 21:30

యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

ప్రసంగి 6:10

ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.

యెషయా 10:15

గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

యెషయా 29:16

అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

యెషయా 64:7

నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

యెషయా 64:8

యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

యిర్మియా 18:6

ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.

యిర్మియా 50:24

బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme