Home యెషయా 38:6 · తెలుగు బైబిల్

యెషయా

Chapter 38 · Verse 6

తెలుగు బైబిల్

యెషయా 38:6

ఇంక పదిహేను సంవత్సర ముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

Book: Isaiah · Chapter: 38 · Verse: 6

Cross References

2 దినవృత్తాంతములు 32:22

ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

యెషయా 12:6

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.

యెషయా 31:4

యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.

యెషయా 37:35

నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

2 తిమోతికి 4:17

అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme