యెషయా 19:23
ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.
యెషయా 19:23
ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.
ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.
అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రముల మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవ ములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.