Home ఆదికాండము 6:22 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 6 · Verse 22

తెలుగు బైబిల్

ఆదికాండము 6:22

నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

Book: Genesis · Chapter: 6 · Verse: 22

Cross References

ఆదికాండము 7:5

తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.

ఆదికాండము 7:9

మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.

ఆదికాండము 7:16

ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.

ఆదికాండము 17:23

అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను

నిర్గమకాండము 7:6

మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.

నిర్గమకాండము 40:16

మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.

నిర్గమకాండము 40:19

మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.

నిర్గమకాండము 40:21

మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

నిర్గమకాండము 40:23

యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.

నిర్గమకాండము 40:25

యెహోవా సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.

నిర్గమకాండము 40:27

దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.

నిర్గమకాండము 40:32

వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.

ద్వితీయోపదేశకాండము 12:32

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

మత్తయి 2:21

శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.

మత్తయి 7:24

కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

యోహాను 2:5

ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme