Home ఆదికాండము 46:2 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 46 · Verse 2

తెలుగు బైబిల్

ఆదికాండము 46:2

అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు - యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు - చిత్తము ప్రభువా అనెను.

Book: Genesis · Chapter: 46 · Verse: 2

Cross References

ఆదికాండము 15:1

ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

ఆదికాండము 15:13

ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.

ఆదికాండము 20:3

అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.

ఆదికాండము 22:1

ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 22:11

యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 31:11

మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.

నిర్గమకాండము 3:3

అప్పుడు మోషే - ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.

సంఖ్యాకాండము 12:6

వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.

సంఖ్యాకాండము 24:4

అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

న్యాయాధిపతులు 7:2

యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.

న్యాయాధిపతులు 7:9

ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెనునీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.

1 సమూయేలు 3:4

యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి

1 సమూయేలు 3:10

తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగాసమూయేలూ సమూ యేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.

2 దినవృత్తాంతములు 26:5

దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.

యోబు 4:13

గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

యోబు 33:14

దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme