Home ఆదికాండము 43:8 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 43 · Verse 8

తెలుగు బైబిల్

ఆదికాండము 43:8

యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;

Book: Genesis · Chapter: 43 · Verse: 8

Cross References

ఆదికాండము 42:2

మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా

ఆదికాండము 42:38

అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.

ఆదికాండము 44:26

మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు.

ఆదికాండము 45:19

నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.

ఆదికాండము 50:8

యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.

ఆదికాండము 50:21

కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.

నిర్గమకాండము 20:12

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

సంఖ్యాకాండము 14:31

అయితేవారు కొల్లపోవుదు రని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతం త్రించుకొనెదరు;

ద్వితీయోపదేశకాండము 33:6

రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.

2 రాజులు 7:4

పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నం దున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని

2 రాజులు 7:13

అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మన విచేసెనుఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదుగురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.

ఎజ్రా 8:21

అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉప వాసముండుడని ప్రకటించితిని.

కీర్తనలు 118:17

నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme