Home ఆదికాండము 2:5 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 2 · Verse 5

తెలుగు బైబిల్

ఆదికాండము 2:5

అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు

Book: Genesis · Chapter: 2 · Verse: 5

Cross References

ఆదికాండము 1:11

దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.

ఆదికాండము 3:23

దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.

ఆదికాండము 4:2

తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.

ఆదికాండము 4:12

నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.

యోబు 5:10

ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

యోబు 38:26

పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను

కీర్తనలు 65:9

నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.

కీర్తనలు 104:14

పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు

కీర్తనలు 135:7

భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

యిర్మియా 14:22

జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.

మత్తయి 5:45

ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

హెబ్రీయులకు 6:7

ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme