Home ఆదికాండము 14:23 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 14 · Verse 23

తెలుగు బైబిల్

ఆదికాండము 14:23

నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యి యెత్తి ప్రమాణము చేసియున్నాను.

Book: Genesis · Chapter: 14 · Verse: 23

Cross References

1 రాజులు 13:8

దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను;

2 రాజులు 5:16

ఎలీషాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.

2 రాజులు 5:20

అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందు ననుకొని

ఎస్తేరు 9:15

షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

2 కొరింథీయులకు 11:9

మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును

2 కొరింథీయులకు 12:14

ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా

హెబ్రీయులకు 13:5

ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme