Home ఆదికాండము 1:5 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 1 · Verse 5

తెలుగు బైబిల్

ఆదికాండము 1:5

దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

Book: Genesis · Chapter: 1 · Verse: 5

Cross References

ఆదికాండము 1:8

దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

ఆదికాండము 1:13

అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

ఆదికాండము 1:19

అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

ఆదికాండము 1:23

అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.

ఆదికాండము 1:31

దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.

ఆదికాండము 8:22

భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

కీర్తనలు 19:2

పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

కీర్తనలు 74:16

పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.

కీర్తనలు 104:20

నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.

యెషయా 45:7

నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.

యిర్మియా 33:20

యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

1 కొరింథీయులకు 3:13

వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

ఎఫెసీయులకు 5:13

సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా

1 థెస్సలొనీకయులకు 5:5

మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారముకాము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme