లేవీయకాండము 1:1యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
2 దినవృత్తాంతములు 29:31అంతట హిజ్కియామీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసి కొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలుల నర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసికొని వచ్చిరి.
ఎజ్రా 2:1బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
ఎజ్రా 6:17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
కీర్తనలు 66:10దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
కీర్తనలు 66:15పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
కీర్తనలు 116:12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
లూకా 1:74అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును