యెహెజ్కేలు 7:17
అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.
యెహెజ్కేలు 7:17
అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.
నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవుశ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బల హీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.
నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.